Header Banner

కోల్ కతాలో ఐపీఎల్ మ్యాచ్.. దూకుడుగా ఆడిన అజింక్యా రహానే, రింకూ సింగ్!

  Thu Apr 03, 2025 21:47        Sports

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్, ఆంగ్ క్రిష్ రఘువంశీ అర్ధసెంచరీలతో రాణించారు. కెప్టెన్ అజింక్యా రహానే, రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడారు. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేయగా, రఘువంశీ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో సరిగ్గా 50 పరుగులు చేసి అవుటయ్యాడు. అంతకుముందు, టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో తడబాటుకు గురైన కేకేఆర్ జట్టు 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (7) సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. ఈ దశలో కెప్టెన్ అజింక్యా రహానే 27 బంతుల్లో 1 ఫోర్, 4 భారీ సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన వచ్చిన రింకూ సింగ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఆండ్రీ రసెల్ (1) రనౌటయ్యాడు. సన్ రైజర్స్ బౌలర్లలో షమీ 1, కమిన్స్ 1, జీషన్ అన్సారీ 1, కమిందు మెండిస్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పరుగులు భారీగా లీకయ్యాయి.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia